చేవెళ్ల నియోజకవర్గం:- ఒక చెక్కు మనసు – లక్షల ఆశలకు వెలుగు:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల పట్టణానికి మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.1,00,11,600/- (రూపాయలు ఒకకోటి పదకొండువేల ఆరువందలు) విలువ గల 100 కళ్యాణ లక్ష్మీ / షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం చేవెళ్ల, నవాబ్ పేట్ మరియు షాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.15,93,500/- (రూపాయలు పదిహేనులక్షల తొంబైమూడువేల ఐదువందలు) విలువ గల 38 చీప్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

