సీఎం రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్యే KR నాగరాజు …
సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు డీసీసీ భవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దలను గౌరవించడం తమ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు.కుటుంబ విషయాలను బహిరంగంగా ప్రస్తావిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు సంబంధిత నాయకులు ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకోవాలని సూచించారు.గతంలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు తాము మౌనంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇకపై సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే నాగరాజు హెచ్చరించారు.పార్టీ నాయకులు పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,మాజీ మేయర్ గుండు సుధారాణి ,హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి ,వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ ,జిల్లా ముఖ్య నాయకులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
