బీజేపీ తెలంగాణ కార్మిక విభాగ రాష్ట్ర జాయింట్ కన్వీనర్‌గా బద్రి దేవేందర్ పటేల్ నియామకం…
కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తా….
–బద్రి దేవేందర్ పటేల్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: హైదరాబాద్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్మిక విభాగ రాష్ట్ర జాయింట్ కన్వీనర్‌గా బద్రి దేవేందర్ పటేల్ నియమితులయ్యారు. తెలంగాణ బీజేపీ కార్మిక విభాగ రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ చేతుల మీదుగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు సమక్షంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా బద్రి దేవేందర్ పటేల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్రనాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కార్మికుల సంక్షేమం, పార్టీ బలోపేతం, ప్రజా సేవ లక్ష్యంగా మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ నియామకానికి సహకరించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, మురళీధర్ రావుతో పాటు పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి, జిల్లా, మండల, శక్తికేంద్ర, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
చివరగా, భారతీయ జనతా పార్టీ ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం, పార్టీ అభివృద్ధి కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని బద్రి దేవేందర్ పటేల్ స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
