తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద

Sakshitha news

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్, భౌరంపేట్ సింహపురి కాలనీలో కాలనీ వాసులు అంజనీ కుమార్ యాదవ్ , వేముల శ్రీనివాస్, దత్తాత్రేయ, S. శివారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పీ. వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం. ఆయన కలలు కన్న ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడారని. ఆ మహనీయుని ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వం చారిత్రాత్మక పాత్ర పోషించిందని. జయశంకర్ సార్ ఆశయాలు, కేసీఆర్ కృషి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top