కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ కాలనీ మరియు అంబేద్కర్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న ఇంటి నిర్మాణ పన్నులు, జరిమానాల గురించి ఈరోజు సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ ని కలిసి సమస్య వివరించడం జరిగింది….
….

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్కిల్లోని వల్లభాయ్ పటేల్ నగర్ కాలనీ మరియు అంబేద్కర్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న అక్రమ ఇళ్ల నిర్మాణాలు అంటూ మున్సిపల్ సిబ్బంది జారీ చేస్తున్న జరిమానాల గురించి *మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ * ఆధ్వర్యంలో వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన (ఐఏఎస్) దృష్టికి తీసుకెళ్లారు, వారు గత 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇవి అక్రమ ఇళ్ల నిర్మాణాలు అంటూ వారు మున్సిపల్ సిబ్బంది విధిస్తున్న జరిమానాలను తక్షణమే ఉపసంహరించి న్యాయం చేయాలని కమిషనర్ మేడం కి విన్నవించారు..
వారి సమస్యలు పూర్తిగా విన్న సైబరాబాద్ కమిషనర్ సృజన జరిమానాలు వేసిన సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పూర్తిస్థాయి లో పరిష్కరిస్తానని తెలియజేశారు..
అదేవిధంగా కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఆరు సర్కిలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర వివరాలను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కి అందజేశారు, ఈ పనులు ప్రభుత్వం నుండి మంజూరైనప్పటికీ ప్రస్తుతం కొన్ని టెండర్ ప్రక్రియలో ఆగిపొవడం జరిగిందని వాటిని వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని కమిషనర్ ని కోరారు, కమిషనర్ తో పాటు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆగం పాండు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, మోటే శ్రీనివాస యాదవ్ అరువ వెంకట్,సాయికిరణ్, గోపాల్ రెడ్డి గుమస్తా మధుసూదన్ మరియు వల్లభాయ్ పటేల్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామ్ రెడ్డి, మరియు సభ్యులు ఎన్ వి రెడ్డి, కృష్ణ, రాము, బుచ్చిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాణిక్య రెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY