59వ. డివిజన్‌లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన…

మౌలిక వసతుల సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశాలు…
….
సాక్షిత పెద్దపల్లి// గోదావరిఖని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 99 రోజుల ప్రజా పాలన పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా 59వ. డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
స్థానిక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
