సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ అపురూప కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా వారి దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, సాయిబాబా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు..

అనంతరం బొబ్బ ప్రసాద్ నివాసం ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుబ్బల వెంకటరమణ, బొబ్బ ప్రసాద్, నాగ శిరోమణి, గోపాల్ రెడ్డి, కుంచె కృష్ణమూర్తి, మల్లేష్ గౌడ్, కొండలరావు, అంజిరెడ్డి, వినయ్ రెడ్డి, పాటిల్, వాణి, నాగలక్ష్మి, వనిత, రంగనాథ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top