SAKSHITHA NEWS

14 సీసీ రోడ్లకు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ.

సాక్షిత న్యూస్.
ఏప్రిల్.05.25.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.అశ్వారావుపేట మండలం లోని గ్రామాలకు 14 సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది.
తిరుమలకుంట, మామిళ్ళవారి గూడెం, వినాయకపురం, హరిజన వాడలలో SC సబ్ ప్లాన్ 68 లక్షల నిధులతో మంజూరైన 14 సీసీ రోడ్లు ను ఎమ్మెల్యే
జారే ఆదినారాయణ చేతుల మీదుగా భూమిపూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి. హరిజనవాడలలో మంజూరైన, అభివృద్ధి పనులను వివరించారు అనంతరం ఇటీవల జరిగిన వినాయకపురం శ్రీ శ్రీ శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మహిళలను ఘనంగా సన్మానించి. నూతన వస్త్రాలు అందించారు కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీ .ఈ శ్రీధర్ , ఏఈ అక్షిత , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ , మండల స్పెషల్ అధికారి ప్రదీప్ కుమార్ , పంచాయతీరాజ్ మండలాధికారి సోయం ప్రసాద్ , మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు , జూపల్లి రమేష్ , సుంకవల్లి వీరభద్రరావు , జూపల్లి ప్రమోద్ , చిన్నంశెట్టి సత్యనారాయణ , మిండా హరి , వేల్పుల సత్యనారాయణ , గ్రామ శాఖ అధ్యక్షులు ఇస్టిని కనకం గడ్డం ఏసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.