ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

SAKSHITHA NEWS

ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

130 – సుభాష్ నగర్ డివిజన్ ఎస్.ఆర్.నాయక్ నగర్ లో కొనసాగుతున్న ఇండోర్ స్టేడియం పనులను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ కాలనీలా అభివృద్ధి కోసం గతంలో కేటాయించిన ఖాళీ స్థలాలలో ఇండోర్ స్టేడియం, పార్కుల అభివృద్ధి వంటి పనులను చేపట్టడం ద్వారా కాలనీవాసులతోపాటు క్రీడాకారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో చేపట్టవలసిన పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, యూసుఫ్, ప్రభాకర్, ఎస్ ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు టిటికే శ్రీనివాస్ రావు, మల్లికార్జునరావు, బాబి, పూర్ణచందర్ గుప్త, శేష చారి, భాస్కర్ రెడ్డి, టీ.అనిల్, రమణ గణేశన్, రామకృష్ణ, దుర్గా రావు, కిరణ్, రాజు, హరిబాబు, వర్మ, రామస్వామి, వేణు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

SAKSHITHA NEWS