SAKSHITHA NEWS

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సూర్యనారాయణరెడ్డి రిటర్నింగ్ అధికారి మాధురికి నామనేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి వైయస్సార్సీపి నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామనేషన్ పత్రాలను సమర్పించారు.
నా విజయం తథ్యం
నామనేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
అత్యధిక మెజారిటీతో గెలిచి అనపర్తి సీటు జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అనపర్తి నియోజకవర్గం ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయమన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తానని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వివిఆర్ సుబ్రహ్మణ్యం, నేత్రవైద్యులు డాక్టర్ తేతలి సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ పూర్వపు ప్రతిపక్ష నేత సత్తి రామారెడ్డి, డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి. ఆర్.కె.ఎగ్స్ అధినేత తేతలి రాధాకృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), వైకాపా రంగంపేట మండలం ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 24 at 2.18.48 PM

SAKSHITHA NEWS