SAKSHITHA NEWS

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంక్షేమ సారుథులు వాలంటీర్లే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

వాలంటీర్లను హేళన చేసి మాట్లాడి, దుష్ప్రచారాలు చేసిన కుటిల బుద్ధి చంద్రబాబుది ..

చందర్లపాడు మండలంలోని పొక్కునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించిన సేవా పురస్కారాలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రధానం చేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిందని, ప్రతీ ఇంటికి సేవలు అందించటంలో వీరి పాత్ర ప్రముఖంగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని, పెన్షన్ మొదలు ప్రభుత్వ సేవలు అందించటంలో వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు తెలిపారు. గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోని వారికి పురస్కారాలను అందజేస్తున్నట్లు చెప్పారు. జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో.. ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి.. అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులుగా వాలంటీర్లను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నందుకు వాలంటీర్ వ్యవస్థకు గుర్తింపు ఇవ్వటం బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. అవినీతికి తావు లేకుండా.. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వివిధ సంక్షేమ పథకాల అమలులో వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో వాలంటీర్లను చూస్తే చంద్రబాబునాయుడు కు కడుపు మంటని.. అందుకే వాలంటీర్లను హేళనగా చూసి అవమానిస్తూ దుష్ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు ..

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కన్వీనర్ కొమ్మినేని మహేంద్ర, ఎంపీటీసీ కటుకూరి వెంకటరత్నం, మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, రాయల జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS