పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం – ఎమ్మెల్యే చిరుమర్తి
— పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)
బీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బిఆర్ ఎస్ పార్టీ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మండలం మర్రుర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు సుమారు100 కుటుంబాలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో షేక్ సయ్యద్, బరిశెట్టి నగేష్, కారే బద్రయ్య, నర్సింగ్ యాదయ్య, గంగుల శ్రీను, బరిశెట్టి భాస్కర్, పోగుల నాగార్జున, నకిరేకంటి గోవర్ధన్, పుట్ట విజయ్ కుమార్, జక్కల వెంకన్న, నడ్డి వెంకన్న, నక్కల వెంకన్న తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట దామోదర్ మార్కెట్ డైరెక్టర్ చిలుకూరి గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ వార్డు సభ్యులు నకిరేకంటి గోవర్ధన్ పుట్ట శైలజ దశరధ నకిరేకంటి శ్రీను తదితరులు ఉన్నారు