SAKSHITHA NEWS

సాక్షిత తిరుపతి* ; కొత్త రోడ్ల నిర్మాణాలతో తిరుపతి నగరంలో నూతన శకం ప్రారంభమవుతున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద నుండి నూతనంగా నిర్మించిన సామవాయి మార్గ్ (చింతలచేను రోడ్డు) ను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతి నగరంలో నూతన శకం రోడ్ల నిర్మాణాలతో ప్రారంభమవుతున్నదని, అందులో మొదటగా దాదాపు పాతిక సంవత్సరాలకు పైగా ఇరుకు రోడ్డుగా వుండి ఈ ప్రాంతంలో ప్రయాణించడానికే ఇబ్బంది పడుతున్న ప్రజల భాదలను చూసిన మునిసిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఒక మంచి పరిష్కారాన్ని ఎంచుకొని ఈ చింతలచేను వైపు వెల్లెదారిని 80 అడుగుల రోడ్డుగా కొత్తగా నిర్మించి నగరానికి అనుసందానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ ఒక్క రోడ్డేకాక తిరుపతిలో 13 మాస్టర్ ప్లాన్ రోడ్లకు పైగా నిర్మించడం జరుగుతున్నది.

తిరుమల శాసన ఆధారాల ప్రకారం తిరుమల గర్భగుడిలో ప్రతిష్టింప చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించిన పల్లవ రాణి సామవాయి పేరును ఈ చింతలచేను రోడ్డుకు సామవాయి మార్గ్ గా మునిసిపల్ కార్పొరేషన్ నామకరణం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ 6 కోట్ల 50 లక్షలతో ఈ రోడ్డును అదేవిధంగా 7 కోట్ల 25 లక్షలతో పూర్తి చేయబడిన అన్నమయ్య మార్గ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి తప్పించడానికి, తిరుపతి అభివృద్దికి చేపట్టిన ప్రదాన పని మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించడమేనన్నారు. నూతన రోడ్ల ప్రారంభంలో ముందుగా పూజలు నిర్వహించి, శుభ సూచికంగా పావురాలను గాల్లోకి వదలడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి, అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, కార్పొరేటర్లు అమరనాధ్ రెడ్డి,ఆధం రాధాకృష్ణా రెడ్డి, రామస్వామి వెంకటేశ్వర్లు, శ్రావణిమునిరామిరెడ్డి, సికె రేవతి, తాళ్ళూరి రత్నకుమారి, ఆంజినేయులు, హనుమంతనాయక్, లడ్డు భాస్కర్ రెడ్డి, నరేంధ్రనాధ్, శేఖర్ రెడ్డి, బోకం అనీల్, అనిష్, తిరుపతి మునిరామిరెడ్డి, నారాయణలు, మోహన్ కృష్ణ, కో ఆప్షన్ సభ్యులు రుద్రరాజు శ్రీదేవి, ఇమామ్, వెంకటరెడ్డి, ఖాదర్ భాష, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రారెడ్డి, వైసిపి నాయకులు వెంకటమునిరెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి,తలారి రాజేంద్ర,జ్యోతిప్రకాష్, గోపినాధ్ రెడ్డి,సురేష్,అమరనాధ్ రెడ్డి,వెంకటేష్ రాయల్, లవ్లీ వెంకటేష్, మధుబాల,గీత,సాయికుమారి తదితరులు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS