నాగార్జునసాగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే భగత్
నాగార్జునసాగర్ సాక్షిత
నాగార్జునసాగర్ కమలా నెహ్రు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో బయో మెట్రిక్, ఓపి సేవలు, రికార్డులు పరిశీలించి రివ్యూ నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
వైద్యులు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలు చాలా మెరుగుపడ్డాయని, సాగర్ లో గతంతో పోలిస్తే ఓపి సేవలు పెరిగాయని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కమలా నెహ్రు ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో డయాలసిస్ రోగుల కష్టాలు కూడా తీరాయని అన్నారు.
ఈ కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్ అనూష శరత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జువాజీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మోదుకూరి రాంబాబు, వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ, కౌన్సిలర్లు రమావత్ మంత నాయక్, రమేష్ జి, ఈర్ల రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి భూష రాజుల కృష్ణ, బీసీ సెల్ నాయకులు ఊర శీను, ఎస్టీ సెల్ నాయకులు చంద్రమౌళి, కార్మిక విభాగ నాయకులు కొండల్, మహిళా నాయకురాలు జానకి రెడ్డి, మాధవి, విజయ్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు అర్షద్, బిఆర్ఎస్ యూత్ నాయకులు హర్ష, సురేష్, సందీప్,అర్జున్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రయ్య, కేరళ సురేష్, నక్క కిషోర్, బండిషన్న, కేశవులు, ప్రదీప్, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి,నాయకులు పాల్గొన్నారు.