ఎమ్మెల్యే పరామర్శ…
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ 5వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి మామ మూలగుండ్ల మల్లారెడ్డి (56) ప్రముఖ న్యాయవాది ఈ నెల 1వ తేదీన ములుగు నుండి హనుమకొండకు వెళ్తుండగా కొందరు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హనుమకొండలోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు మరియు కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డిని పరామర్శించి ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే పరామర్శ…
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి…
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జోగులాంబ గద్వాల జిల్లా…