మాజీ మంత్రి నల్లపరెడ్డి నివాసానికి మిథున్ రెడ్డి..

Sakshitha news

మాజీ మంత్రి నల్లపరెడ్డి నివాసానికి మిథున్ రెడ్డి..

రాజంపేట వైసీపీ పార్లమెంట్ సభ్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేడు నెల్లూరులోని మాజీ మంత్రి , వైసీపీ రాష్ట్ర పి ఎ. సి. సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.