జేవీవీ ఆధ్వర్యంలో గర్భిణీలకు భోజనాలు
…..
సాక్షిత ప్రతినిధి – గూడూరు / తిరుపతి: నెల్లూరు జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో వికె షోరూం అధినేత మల్లికార్జున దాతృత్వంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని నిరుపేద గర్భిణీ స్త్రీలకు ముఖ్య అతిథి డాక్టర్ షరీనా చేతుల మీదుగా భోజనాలు (వెజిటేబుల్ రైస్, గుడ్డు, అరటిపండు) పంపిణీ చేశారు. డాక్టర్ షరీనా మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ దాతగా వ్యవహరించిన వి.కే షోరూం అధినేత మల్లికార్జునని ప్రత్యేకంగా అభినందించారు. వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
అదేవిధంగా జనవిజ్ఞాన వేదిక వారు మా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని విధాలుగా సహకరిస్తూ గత 13 సంవత్సరముల నుండి గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఇస్తున్నందుకు జే.వి.వి సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దాత
మల్లికార్జున మాట్లాడుతూ జే.వి.వి. ద్వారా నిరుపేద గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఇచ్చే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జె.వి.వి అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, రామ మోహన్, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, ఆనంద్, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
