మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపాన్ని తెలియజేసిన మంత్రి సీతక్క …
ములుగు జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు…
కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేయాలి…కార్యకర్తలకు అండగా ఉంటాం…
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి…
ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా నాయకులు కృషి చేయాలి…
పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది…
అరవై యేండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు…
దేశంలో ఆధార్ కార్డును తీసుకువచ్చిన ఘనత కూడా మన్మోహన్ గారిదే..
ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవారికి ప్రతి నెల 5 కేజీల బియ్యాన్ని అందించిన ఘనత కూడా మన్మోహన్ గారిదే…
పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తాం… : గోవిందరావుపేట మండల కేంద్రంలోని సోమలగడ్డ క్రాస్ రోడ్డు ఎదుట ఉన్న పి.ఎస్.ఆర్. గార్డెన్స్ యందు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని సంతాప సభ మరియు ములుగు జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి అనసూయ సీతక్క విచ్చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని, వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భముగా సీతక్క మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయేపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారిగా 2004లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి 2014 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా కూడా పనిచేశారు. పీవీ నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహునిగా భావిస్తారు. పీవీ విధానాల అమలులో మన్మోహన్ సింగ్ గారు కీలక పాత్ర పోషించారు. భారత్‌కు 13వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు.
- 1982 నుంచి 1985వరకు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు.
- 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
- 1991లోయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
- ఆర్థికమంత్రిగా పీవీ నరసింహరావు నామినేట్ చేసే సమయానికి మన్మోహన్ సింగ్ యూజీసీ చైర్మన్‌గా ఉన్నారు.
- 1991 జూన్‌లో కేంద్రమంత్రి బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ అదే ఏడాది అక్టోబరులో రాజ్యసభ ఎంపీ అయ్యారు.
- అస్సాం నుంచి వరుసగా ఐదుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
- 2019లో ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు.
ఇంగ్లీషు, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగల మన్మోహన్ సింగ్ మేధావిగా గుర్తింపు పొందారు. మన్మోహన్ సింగ్ భారత దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. వారి మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది అని, వారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. అలాగే దేశంలో ఆధార్ కార్డు వ్యవస్థను, రేషన్ కార్డు వ్యవస్థను, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ప్రధాన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని, సోనియమ్మ ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని అన్నారు. - అలాగే ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పని చేయాలి అని, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు ప్రభుత్వం పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళలను అభివృద్ధి పథంలో నడుపుతున్నదని, అలాగే రైతులకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు 2018 నుండి డిసెంబర్ 9 2023 వరకు పంట రుణాలు తీసుకున్న వారికి 2 లక్షల పంట రుణమాఫీ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, అలాగే రైతు భరోసా కూడా నూతన సంవత్సరం సందర్భంగా రైతులకు అందిస్తాం అని, అలాగే రైతు కూలీలకు కూడా 12000 రూపాయల భరోసా అందిస్తాం అని కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా గడప గడపకు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నేను ఉంటానని, ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులకు అందేలా నాయకులు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత పదవులు దక్కుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, ములుగు జిల్లా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.