PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ఆంగ్ల నూతన సంవత్సరం

Sakshitha news

PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షల వెల్లువ

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు – PAC చైర్మన్ అరెకపూడి గాంధీ

ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ , మరియు నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు మరియు విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ​ ​ఈ 2026 ఆంగ్ల నూతనసంవత్సర కాలంలో మీరు నిత్యనూతన ఉత్సహాం తో, చిరునవ్వుతో ఉండాలని , మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని, మీరు చేయబోయే ప్రతీ కార్యం లో మీకు విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ​మీకు​ మీ కుటుంబసభ్యులకు 2026 ఆంగ్ల ​నూతన సంవత్సర శుభాకంక్షాలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.