
భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా
సాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ ను మంత్రి పరిశీలించారు. అనంతరం పిసిఎన్ హైస్కూల్ నుంచి ఓం శక్తి గుడి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మంత్రి రోజా మాట్లాడుతూ పింగళి వెంకయ్య 146వ జయంతిని దేశమంతా నిర్వహించుకోవడం చాలా గర్వకారణంగా వుందని అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మన తెలుగు గడ్డ మీద పుట్టిన మన మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని మన రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
