SAKSHITHA NEWS

సంఘటితంగా టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి – మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి.

కేతేపల్లి (సాక్షిత ప్రతినిధి)

కేతేపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ లు హాజరయ్యారు. కేతేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 14సం.లు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి రైతాంగాన్ని ఆదుకోవాలని మిషన్ కాకతీయ ప్రాజెక్టుతో సాకారం చేశారన్నారు. రైతుల కష్టాలు, ఆత్మహత్యలు, ఆడపిల్లలు ఉన్న కుటుంబాల కష్టాలు చూసి ముఖ్యమంత్రి అవగానే రైతులకి ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నారని, కేంద్రం లో బిజెపి ప్రభుత్వ నియంతృత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈడి, సిబిఐ లతో దాడులు చేస్తున్నదని అన్నారు. మోటర్లకి మీటర్లు పెట్టాలని బిజెపి ఒత్తిడి చేసిన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బయపడలేదని అన్నారు. ఎల్ ఐ సి ప్రభుత్వ సంస్థని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, ప్రభుత్వ ఆస్తులను అదాని కి దారాదత్తం చేస్తున్నారని ఇలాంటి పరణామాలు దేశానికి ప్రమాదకరం అని అన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ
బిఆర్ఎస్ పార్టీ నీ ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్ళు , నిధులు లేక తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని మిషన్ కాకతీయ ప్రాజెక్టుతో రైతాంగాన్ని అభివృద్ది చేయాలని ఆలోచించి, దాంతోపాటు ఉచిత కరెంట్ కూడా ఇచ్చిన ఘనత కేసిఆర్ ది అని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశం మొత్తం అమలు చేయాలని కేసీఆర్ టిఆర్ ఎస్ పార్టీ నీ బిఆర్ ఎస్ పార్టీ గా మార్చారని అన్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబానికి పార్టీ తరపున 2లక్షల రూపాయల చెక్కును అందిస్తు బరోసా కల్పిస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చి ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసిలు వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS