బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏపార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెలో పెట్టుకుని ఎవరు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తారో రావాలని వారితోనే పొత్తు పెట్టుకుని ఆపార్టీతోనే ఉంటాంమని నీలంమధు ముదిరాజ్ అన్నారు.
సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభకు అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్‌లకు ఎన్నిసీట్లు ఇస్తారో రండి వారివెంటే మా ముదిరాజ్‌లు అందరూ నడుస్తామన్నారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి కూడా కావాలని పోరాడతామన్నారు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరాజ్‌లను రాజకీయం గుర్తింపు లేదా మేము బ్రతకిలేం అనుకుంటున్నారా తెలంగాణలో వేరే రాష్ర్టంలో పుట్టివచ్చినామనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్ బిడ్డలకు భవనాలు, చేపపిల్లలు ఇవ్వడం కాదని రాజ్యాధికారం దిశగా మేము ఎదగాలని ఆయన అన్నారు.
మా ఓటు మేమే వేసుకుంటామని, మద్యం,డబ్బు, ప్రలోభాలకు గురిచేసినా తీసుకోవాలని పోలింగ్ బూత్‌కు పోయిన రోజు జనగణమణ అని ఓటు వేయాలన్నారు. ముదిరాజ్ బిడ్డలు ఎక్కడ నిలబడితే వారికే ఓటువేయాలన్నారు. మా ఆత్మగౌరవం నిలబెట్డండి అని సబ్బండ వర్గాలకు చెందిన కులాలను కలుపుకుని వారిని కోరుకుందామని అన్నారు. ముదిరాజ్‌లు అంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ,ముదిరాజ్ సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.