SAKSHITHA NEWS

Members of Shankarpalli BSI participating in the 2568th Buddha Jayanti celebrations.
 2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు.

సాక్షిత : 2024,మే 23 వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతోత్సవాన్ని 'ధార్మిక ప్రజాస్వామ్యం' దేదీప్యమానంగా వెలుగొందాలని మైత్రీభావనతో ఘనంగా జరుపుకోవాలని,శాంతి, కరుణ,ప్రేమ,అహింస, సత్యమార్గాన్ని చూపిన తథగత గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో ఆనందంగా,సంతోషంగా నడవాలని కోరి బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా శంకర్పల్లి సభ్యులు మహా బోధి బుద్ధ విహార్ లో జరిగిన బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.వైశాఖ పౌర్ణమి బౌద్ధంలో చాలా ప్రాధాన్యత కలిగిన రోజు బుద్ధుడు జన్మించిన రోజూ, జ్ఞానోదయం పొందిన రోజూ,పరినిర్వాణం చెందిన రోజూ,ఈ మూడు చారిత్రక సంఘటనలు జరిగినది వైశాఖ పౌర్ణమి రోజే కాబట్టి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజు అని ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్న బౌద్ధ అభిమానులు తెలియజేయడం జరిగింది.
బుద్ధం శరణం గచ్చామి!
ధమ్మం శరణం గచ్చామి!!
సంఘం శరణం గచ్చామి!!!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మర్పల్లి అశోక్ మణి బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్,బేగరి అర్చన రాములు బీఎస్ఐ ముఖ్య సలహాదారు,బండారి మణి బాలకిషన్ బి ఎస్ ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక సభ్యులు ఎస్ జయ రవీందర్,రాజు వసంత,నారాయణ, బాలరాజు,కృష్ణ,సూరి, ప్రభు,లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2024 05 23 at 17.47.09

SAKSHITHA NEWS