మెగాస్టార్ చిరంజీవికు మంత్రి పువ్వాడ అజయ్ దంపతుల ఆహ్వానం

మెగాస్టార్ చిరంజీవికు మంత్రి పువ్వాడ అజయ్ దంపతుల ఆహ్వానం

SAKSHITHA NEWS

మెగాస్టార్ చిరంజీవికు మంత్రి పువ్వాడ అజయ్ దంపతుల ఆహ్వానం

రాఖీ పౌర్ణమి సందర్భంగా చిరంజీవికి రాఖీ కట్టిన మంత్రి సతీమణి

…….

సాక్షిత : ఈ నెల 20వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ తమ కుమారుడు నయన్ రాజ్ వివాహ వేడుకకు రావాలని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ తెలుగు సినీనటుడు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి దంపతులను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంతలక్ష్మి దంపతులు శుక్రవారం ఆహ్వానించారు. హైదరాబాద్ లోని వారి నివాసంలో చిరంజీవిని కలిసి మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా చిరంజీవికి మంత్రి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS