మెగా సైన్స్ ఫేర్ & తింకరింగ్ సైన్స్ ల్యాబ్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

మెగా సైన్స్ ఫేర్ & తింకరింగ్ సైన్స్ ల్యాబ్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని సెయింట్ ఐజక్ అడ్వెంట్ హై స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘తింకరింగ్ సైన్స్ ల్యాబ్ మరియు మెగా సైన్స్ ఫేర్‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అంశాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.

అనంతరం తింకరింగ్ ల్యాబ్ ప్రారంభించిన సందర్భంగా 60 ఏళ్లకు పైగా ఉన్న 100 మంది వృద్ధులకు స్కూల్ యాజమాన్యం సౌజన్యంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా బెడ్ షీట్లు పంపిణీ చేశారు. యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఫౌండర్ & డైరెక్టర్ ఐజక్ లాజం, ప్రిన్సిపల్ శ్యామల రావు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page