SAKSHITHA NEWS

కొడంగల్ లో త్వరలో మెగా వంటశాల

మహబూబ్ నగర్ జిల్లా:
కొడంగల్ నియోజకవర్గం లోని హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

కొడంగల్‌లో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిట బుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది ఈ మెగా వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గం లోని 28 వేల పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించనున్నారు.

త్వరలోనే ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించను న్నారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సీఎస్సార్‌ ఫండ్స్‌ తో నిర్వ హించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సాయం త్రం సమావేశమయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యా ర్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించ డమే లక్ష్యంగా ప్రజా ప్రభు త్వం ముందుకు వెళుతు న్నందున, ఆ అంశంపై పూర్తి గా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్య మంత్రి సూచించారు..

WhatsApp Image 2024 07 29 at 09.04.09

SAKSHITHA NEWS