వీధి కుక్కల నుండి. పిచ్చికుక్కల నుండి . ప్రజలను కాపాడండి
… సిపిఐ…
నంద్యాల సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో సైర విహారం చేస్తూ పిల్లలను. మహిళలను. వృద్ధులను. విచక్షణారహితంగా కరుస్తున్న వీధి కుక్కలను. పిచ్చి కుక్కలను .అరికట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్. ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్. నడిగడ్డ సిపిఐ శాఖ కార్యదర్శి డప్పు ఖలీల్ తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ పట్టణములో ఏ వీధులలో చూసిన ఏ రహదారులలో చూసిన వీధి కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తుంటాయి. ఇవి సాలవన్నట్టు. పిచ్చి ఎక్కిన కుక్కలు తిరుగుతూ కనపడిన వారి పైన పడి దాడి చేస్తున్నవి. గతంలో వీధి కుక్కలు. పిచ్చికుక్కలు క రిసి పట్టణంలో వందల మంది హాస్పటల్ పాలు అయినారు. డంపు యార్డు దగ్గర వీధి కుక్కల నియంత్రణ కేంద్రం ఒక కోటి రూపాయలతో ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించడం జరిగింది. కానీ అది ఇప్పుడు నిరుపయోగంగా ఉంది ఆ కోటి రూపాయలు ఎందుకు ఖర్చు చేసినారో మున్సిపల్ అధికారులు ప్రజలకు తెలపాలి. ఈ సమస్యలపై సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కలెక్టర్ గారు స్పందించి ఈ విషయం నా నోటీసుకు కూడా వచ్చింది అని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్‌ను పిలిచి ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అని అన్నారు
వీధి కుక్కల నుండి. పిచ్చికుక్కల నుండి . ప్రజలను కాపాడండి
Related Posts
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్
SAKSHITHA NEWS వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని…
ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం
SAKSHITHA NEWS ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయంసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడం తీవ్ర కలకలం…