ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “మెగా జాబ్ మేళా”
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ నెల 21వ తేదిననగరంలోని ఏస్ బి ఐ టి ఇంజనీరింగ్ కాలేజ్ అవరణలో నిర్వహిస్తున్న “మెగా జాబ్ మేళా” నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ విజ్ఞప్తి చేశారు.
ఈ జాబ్ మేళాకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఏస్ హెచ్ ఓ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
వంద వరకు ప్రవేటు, కార్పొరేట్ కంపెనీలు రానున్న ఈ జాబ్ మేళాల ద్వారా సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అర్హులైన యువతీ యువకులు వారి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఈనెల 18 వ తేది లోపు స్వయంగా సమర్పించాలని సూచించారు. దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా ఆయా పోలీస్ స్టేషన్ లలో అందుబాటులో వుంటాయని తెలిపారు. జాబ్ మేళా అనంతరం ఉద్యోగాల నియామక వివరాలు తెలియజేయబడుతుందని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో
పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.