తిరుపతి స్మార్ట్ సిటి అభివృద్ది పనులుపై సమావేశం - ఎండి అనుపమ అంజలి *సాక్షిత * : తిరుపతి స్మార్ట్ సిటి పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంట్టున్నట్లు తిరుపతి స్మార్ట్ సిటి బోర్డ్ సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటి ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి స్మార్ట్ సిటీ బోర్డ్ సభ్యులకు వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డు సమావేశం శనివారం తిరుపతి నగరపాలక సంస్థ వీసి హాల్లో జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, టిటిడి జేఈఓ సధా భార్గవి, అమరావతి నుండి ఇంజనీర్ ఇన్ ఛీఫ్ ఆనందరావు, తుడా వీసి హరికృష్ణ, ప్రోఫెసర్ రమశ్రీలు వర్చువల్ పద్దతిలో పాల్గొనగా, తిరుపతి స్మార్ట్ సిటి ఎండి అనుపమ అంజలి, న్యూడిల్లీ నుండి విచ్చేసిన స్మార్ట్ సిటి అండర్ సెక్రటరీ విజయకుమార్, జనరల్ మేనేజర్ చంద్రమౌళి, బోర్డ్ సభ్యులు డా.రామచంధ్రారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఈఈ చంద్రశేఖర్ పాల్గొని 2021-22 ఆర్ధిక సంవత్సరం యొక్క ఆర్ధిక ఖతాలను ఆమోదించడం జరిగింది. సమావేశం అనంతరం స్మార్ట్ సిటి ఎం.డి అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపైన, ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల పని తీరుపై బోర్డు సభ్యులకు వివరించడం జరిగిందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నూతన భవనంతో కలిపి సిటీ ఆపరేషన్ సిస్టమ్ బిల్డింగ్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ పై కమిటి ఆమోదం తెలపడం జరిగిందని, తిరుపతి రైల్వే పార్శిల్ ఆఫిసు ఎదురుగా నిర్మించబోయే మల్టి లెవల్ కార్ పార్కింగ్ కోసం పెరిగిన అంచనా వ్యయంపై చర్చించి ఆమోదించడం జరిగిందన్నారు. ఇప్పటికే పూర్తి కావొస్తున్న దశలోని శ్రీనివాససేతు, వినాయకసాగర్, గొల్లవానిగుంట క్రికెట్ స్టేడియం పనులను మరింత వేగవంతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. దేశంలోనే తిరుపతి స్మార్ట్ సిటికి ఓక గొప్ప ప్రత్యేకతను తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, సి.ఎఫ్.ఓ మల్లిఖార్జున్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి స్మార్ట్ సిటి అభివృద్ది పనులుపై సమావేశం – ఎండి అనుపమ అంజలి
Related Posts
భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు
SAKSHITHA NEWS భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు ఇక రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా…
నూతన ఏడాది క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
SAKSHITHA NEWS నూతన ఏడాది క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . జి.కొండూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అంకెమ్ సురేష్ , గ్రామ పార్టీ అధ్యక్షుడు పజ్జూరు వెంకటేశ్వరరావు (బుల్లి) రూపొందించిన నూతన ఆంగ్ల ఏడాది 2025 క్యాలెండర్ను మైలవరం…