SAKSHITHA NEWS

ప్రజాభివృద్దికి ఆధునిక రహదారులు – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్*


*సాక్షిత : *తిరుపతి నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నవని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. నగరం అభివృద్ది చెందాలంటే సరైన రహదారులు వుండాలనే లక్ష్యంతో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉపయోగకరంగా మారుతున్నాయని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. నగరంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలిస్తూ కొర్లగుంట మెయిన్ రోడ్డు, రేణిగుంట అంకురా హాస్పిటల్ రోడ్డు పనులను తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్ అమరనాధ్ రెడ్డి, మునిరామిరెడ్డి, అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ కొర్లగుంట మెయిన్ రోడ్డు దాదాపు పూర్తి కావొచ్చిందని, త్వరలో అన్ని పనులను పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. అనంతరం రేణిగుంట అంకురా హాస్పిటల్ ప్రక్కనున్న రోడ్లను పరిశీలిస్తూ 8 కోట్ల రూపాయాలతో పూర్తి చేసిన ఈ రెండు రోడ్లను ఆదివారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంధ్ర సరస్వతి మహాస్వామి మార్గము, తొండమాన్ చక్రవర్తి మార్గములను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సునీత, ఎస్.ఈ మోహన్, ఎం.ఈ వెంకట్రామిరెడ్డి, నాయకులు గోఫి, రవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS