SAKSHITHA NEWS

Massive transfers of IAS in Telangana

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

హైదరాబాద్:
తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపడుతున్నారు.

ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసి జిల్లాలకు కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మెుత్తం 44 మంది అధికారులకు స్థాన చలనం కల్పించారు.

పలువురు అధికారులనకు కీలక బాధ్యతలు అప్పగిం చారు. హెచ్‌ఎండీఏ జాయిండ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు.

ప్రస్తుతం ఈ పోస్టింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా నియమించారు.

ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీ మణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామ య్యర్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమెను.. దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎం బాధ్యతల నుంచి రిజ్వీని తప్పించి.. ఆయనకు కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.

కీలమైన జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని, సెర్ఫ్ సీఈవోగా దివ్య, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజ య్ కుమార్, పాఠశాల విద్యాశాఖ డెరెక్టర్‌గా నర్సింహ్మా రెడ్డి, జేఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు…

WhatsApp Image 2024 06 24 at 18.17.55

SAKSHITHA NEWS