SAKSHITHA NEWS

మహిళల ఆత్మ రక్షణకు మార్షలార్ట్స్‌…
-సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు అవసరం

ఉషు ఛాంపియన్షిప్‌ పోటీల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

సాక్షిత రాజమహేంద్రవరం : ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మ రక్షణకు మార్షలార్ట్స్‌ నేర్చు కోవడం చాలా అవసరమని, అలాగే మన సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడాలు దోహదపడతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) సూచించారు. స్థానిక ఫారెస్ట్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ హాలులో రెండు రోజుల పాటు జరిగే 9వ ఇంటర్‌ డిస్ట్రిక్టు ఉషు సీనియర్‌ అండ్‌ సబ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం చేకూరుతుందని, దేహదారుఢ్యం సొంతమవుతుందన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను వారు ప్రతిఘటించాలంటే మార్షలార్ట్స్‌ వంటి కళను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఆదిశేషు, కార్యనిర్వాహకులు బి.నరసింహరావు, టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్‌, మరుకుర్త రవి యాదవ్‌, హరి బెనర్జీ, జిల్లా ఉషు అసోసియేషన్‌ అధ్యక్షుడు అజ్జరపు వాసు, కార్యదర్శి ఆర్‌.సుందరం, పొన్నాడ బాబి, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS