సాగర్ నీటిలో దర్శనమిస్తున్న పురుగులు….
మార్కాపురం పట్టణంలో ప్రతి నాలుగు రోజులకు ఓసారి వదులుతున్న సాగర్ నీటిలో పురుగులు దర్శనం ఇవ్వటం అధికారుల అని తీరుకు అద్దం పడుతుంది.
దీనిపై పుర ప్రజల నుంచి పెద్ద ఎత్తున పురపాలక శాఖ ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదులు అందిన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
నేడు అనగా పట్టణంలోని గొర్లగడ్డ, కోర్టు కూడలి, రజక వారి వీధి, ఇతర ప్రాంతాల్లో విడుదల చేసిన సాగర్ నీటిలో వందల సంఖ్యలో ప్రత్యక్షమైన పురుగులు
నీటిలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదులు అందిన నిమ్మకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్కాపురం పురపాలక శాఖ కమిషనర్ గిరి కుమార్, డీఈ షేక్ సుభాని, ఏఈ ఆదినారాయణ……
గత కొద్దికాలం నుంచి దూపాడు లో నిలిచిన పంపింగ్ ప్రక్రియ. కేవలం మార్కాపురం లో ఉన్న గుండ్లకమ్మ నుంచి నీటిని సరఫరా చేస్తున్న అధికారులు.
పర్యవేక్షణ మరిచిన మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిల్లంచర్ల బాల మురళీకృష్ణ, పట్టించుకోని పుర అధికారులు. మండిపడుతున్న పట్టణ ప్రజానికం.