సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్, మరియు సాయి నగర్ కాలని లో పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీ లోని మంజీరా నీరు మరియు డ్రైనేజ్ సమస్యపై జలమండలి అధికారులతో పరిశీలించామని, సమస్యను వెంటనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలానే త్వరితగతిన పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, లైన్ మెన్ సునీల్, జిహెచ్ఎంసి చంటి, వెంకట్ రావు, యాసిన్, కె ఎన్ వి ప్రసాద్, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్, మరియు సాయి నగర్ కాలని లో పలు సమస్యలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…