SAKSHITHA NEWS

WhatsApp Image 2023 06 27 at 6.13.59 PM

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

కామేపల్లి మండలంలో బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగులేటి శీనన్న . కోరం కనకయ్య.బాటలో నడుస్తామని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వందలాది కుటుంబాలు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రుక్కి తండా గ్రామపంచాయతీ పరిధిలో గల బండిపాడు గ్రామం నుండి దాదాపు 20 కుటుంబాలు బి ఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మిగులు బడ్జెట్ 16 వేల కోట్ల రూపాయలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల అప్పుల రాష్ట్రం గా చేసి ప్రతి వ్యక్తి పై లక్ష రూపాయలు భారంవేసిన కెసిఆర్ ను ఏది ఏమైనా గద్దె దించాలని సంకల్పంతో తెలంగాణలోని ప్రతి విద్యార్థి ఉద్యోగి మేధావి, రైతులు కార్మికులు కర్షకులు సిద్ధమయ్యారని, ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీను అన్నను తడిగుడ్డతో గొంతు కోసి నమ్మకద్రోహం చేసి నందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని మల్లి బాబు యాదవ్ తెలిపారు. శ్రీనన్న బిఆర్ఎస్ కు ఏదైతే సవాల్ విసిరారో దానికి భయపడిన అధికార పార్టీ నాయకులు శీనన్న వెంట తిరుగుతున్న నాయకుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు కేవలం ఇంకా మూడు నెలలు మాత్రమే సాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బానోతు నరసింహ నాయక్. శీలం. పుల్లయ్య. బండి ఉపేందర్.బండి ఎల్లయ్య.లక్ష్మీ నర్సు. పాటిబండ్ల ప్రసాద్. బి. నాగేంద్రబాబు మాజీ ఉపసర్పంచ్ జాటోతు రామా.
గుగులోతు లాల్ సింగ్. బాసు. సక్రు రామారావు. బానోతు సక్రు.సతీష్. గుగులోతు లచ్చిరాం. మాజీ వార్డ్ మెంబర్ పద్మ. పంతులు. కే నరసింహారావు. బో ళ్ల కృష్ణ. టీ. వెంకన్న.తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS