మంత్రిచే అన్నదాన భవనం ప్రారంభం
సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పర్యటన చేసారు. ఇందులో భాగంగా నాగలాపురం మండలం సురుటుపల్లి లోని పల్లికొండేశ్వర ఆలయం లో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నూతనంగా 18 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసిని, ఆలయ ప్రాంగణంలోనే 49.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన అన్నదాన భవనం ను ఎమ్మేల్యేలు నారాయణ స్వామి, ఆదిమూలంలతో కలసి మంత్రి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక గొప్ప దేవాలయాలు ఉన్నాయనీ, వరలక్ష్మి వ్రతం పర్వదినాన ఈ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, అలాగే సిఎం జగన్ మోహన్ రెడ్డి ని ఆశీర్వదించాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రిచే అన్నదాన భవనం ప్రారంభం
Related Posts
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం
SAKSHITHA NEWS సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో…
స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు భారతరత్న
SAKSHITHA NEWS స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు భారతరత్న? హైదరాబాద్:దేశానికి మన్మోహన్ సింగ్ విశిష్టమైన సేవలు అందిం చారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్‌ది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. మన్మోహన్…