ఎల్లమ్మ అమ్మవారి బోనాల జాతరలో పాల్గొన్న మనాలి ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ. డివిజన్ శివాజీ నగర్ కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి బోనాల జాతరలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం, ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తై 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులకు, భక్తులకు మనాలి ఠాకూర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక డివిజన్ కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
