అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి అనేది ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది

Participants engaging in a community celebration with flower petals.

Sakshitha news

అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి అనేది ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది

ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంతటి ప్రేమను పొందలేము

*సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
కెసిఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిన సందర్భంలో అశ్వారావుపేటకి చెందిన దుర్గకి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మెచ్చా నాగేశ్వరరావు మంజూరు ఉత్తర్వులు అందజేశారు.
ఈరోజు అశ్వారావుపేట మసీద్ వద్దకు వెళ్లిన సందర్భంలో కారు దిగిన ఎమ్మెల్యే మెచ్చాని చూసిన దుర్గ మా ఎమ్మెల్యే వచ్చారు. అని ఎంతో సంతోషంగా దెగ్గరకు వచ్చి బాగున్నారా అంటూ పలకరించగా పక్కనే ఉన్న మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి అమ్మ నీకు తెలుసా అని అడుగగా నాకు పెన్షన్ ఇచ్చింది. మా ఎమ్మెల్యే నే అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మసీద్ లోకి వెళ్ళి కార్యక్రమం ముగించుకొని బయటకు వచ్చే సరికి దుర్గా అప్పటికి అప్పుడు పక్కన చెట్లకు ఉన్న పూలు కోసుకొని వచ్చి ఎమ్మెల్యే మెచ్చా పైన పూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకుంది. బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని గుర్తించినందుకు ఆయన ఆనందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు