పదేళ్ల కళ నేటికి సాకారం – పేదల కళ్ళల్లో చిగురించిన ఆనందం
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ ఎస్ మండలం నసీంపేట గ్రామానికి చెందిన మారేపెళ్లి రమణ, నాగయ్య దంపతుల 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్వంత ఇల్లు కల సాకారం అయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా వారికి ఇల్లు మంజూరైంది. పేదరికంలో జీవనం గడుపుతున్న ఈ కుటుంబానికి భూమి, వనరులు ఏవీ లేకపోవడంతో గతంలో పలుమార్లు అప్పటి ప్రభుత్వాలను, స్థానిక ప్రముఖులను ఆశ్రయించినా ఎలాంటి ఫలితం దక్కలేదు. తాజా గా క్రిలంగాన రాష్ట్ర ముఖ్యమంత్రీ రేవంత్ రెడ్డి తీసుకున్న పెదాలకు ఇందిరమ్మ ఇల్లు నిర్ణయంతో వారి కల నెరవేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు కేటాయించడంలో కృషి చేసిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, నసీంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు మూల ఎల్లయ్యకు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు కూడా స్పందిస్తూ, నిజమైన పేదలకు అండగా నిలుస్తున్న ఇందిరమ్మ పథకం పేదల జీవనోపాధికి బలమని అభినందించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
