గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

SAKSHITHA NEWS

Man dies in suspicious condition in granite quarry

గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వoతాపూర్ శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో నెలబోయా పర్సయ్య (65) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అర్ధరాత్రి 12 తర్వాత ఇంట్లో నుంచి వెళ్లి క్వారీ వద్ద శవం అయి కన్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఎస్ఐ అబ్దుల్ రహీం ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. అయితే మృతుని శరీరంపై గాయాలు ఉండడం వల్ల అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

SAKSHITHA NEWS