తిరుపతి ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్
సాక్షిత : నగరంలోని ప్రతి ఇంటి ముందు ఎన్నికల డోర్ నంబర్, మునిసిపల్ డోర్ నంబర్ స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను తిరుపతి ఎన్నికల ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అదేశించారు. ఓటర్ల జాబితా పై నగరపాలక సంస్థ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చిన సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 21 వ తేదీకి ఇంటింటి సర్వే పూర్తి అవుతుందన్నారు. బి.ఎల్. ఓ లు, బి.ఎల్. ఏ లతో కలసి సర్వే పక్కగా చేస్తున్నారని అన్నారు. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్న తమ అధికారులను కలసి నివృత్తి చేసుకోవాలని అన్నారు. నగరంలో అన్ని ఇండ్ల వద్ద ఇప్పటికే ఎన్నికల డోర్ నంబర్, మునిసిపల్ డోర్ నంబర్లను వేశారన్నారు. వాటిని ఇంకా స్పష్టంగా కనిపించేలా పెయింట్ తో వేయించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, తహశీల్దార్ వెంకటరమణ, డి.టి. జీవన్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.