నాన్నని గెలిపించండి

Spread the love

ఎన్డీయే కూటమిని ఆదరించండి

కుమార్తె డా౹౹చదలవాడ అమూల్య ఇంటింటి ప్రచారం

నరసరావుపేట ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబును గెలిపించుకోవాలని ఆయన కుమార్తె డాక్టర్ చదలవాడ అమూల్య తనదైన శైలిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.నరసరావుపేట పట్టణంలోని 31వ వార్డులో పార్లమెంటు అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు సతీమణి మేఘనతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సౌమ్యుడిగా ప్రజాసేవకుడిగా పేరొందిన డా౹౹చదలవాడ అరవింద బాబును గెలిపించేందుకు అంతా తోడుగా నిలవాలని గడపగడపకూ వెళ్లి ప్రచారం నిర్వహించారు.గడపగడపనా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.

సూపర్ సిక్స్ పథకాలను,వాటి ద్వారా కలిగే లబ్దిని వివరించారు.జగన్ రెడ్డి బటన్ నొక్కుడు పేరుతో చేస్తున్న దగాను గడపగడపనా వివరించారు.పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు,విద్యుత్ ఛార్జీల వాతలు జగన్ రెడ్డి పాలనకు నిలువెత్తు నిదర్శనాలు అన్నారు.మరోవైపు రాష్ట్రంలోని రోడ్ల కారణంగా వేలాది మంది రోజూ ఆస్పత్రుల్లో చేరుతున్నారన్నారు.చంద్రబాబు రోడ్లు వేసిన రోడ్లే తప్ప..గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఒక్క అడుగు రోడ్డేసిన పాపాన పోలేదన్నారు.సూపర్ సిక్స్ పథకాలు మన భవితకు మార్గదర్శకాలుగా నిలవబోతున్నాయన డా౹౹అమూల్య,లావు మేఘన వివరించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page