SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు ,రాష్ట్ర సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టీపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ముఖ్య అతిధులుగా కేజీఆర్ కన్వెన్షన్ హాల్ లో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆయా డివిజన్ల కార్పొరేటర్ల సమన్వయంతో వివిధ పార్టీల సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,అనుచరులు దాదాపు వెయ్యి మందికి పైగా భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా అతిథులు,ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తూ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా అతిథులు,ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ…ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పాలన,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ను వివరిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్ధి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు అందరూ కృషి చేయాలని,మంచి నాయకత్వం కలిగిన సునీత మహేందర్ రెడ్డి ని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని,అందుకు మనమందరం కృషి చేయాలని తెలియజేశారు.

అదే విధంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజికవర్గం స్థాయిలో ప్రస్తుతం ఎటువంటి పార్టీ జెనరల్ బాడీ కమిటీలు,అనుబంధ కమిటీలు వేయకూడదని,ఒకవేళ వేసినా అవి చెల్లుబాటు కావని,పార్లమెంట్ ఎన్నికల అనంతరం నాయకులు, కార్యకర్తల పనితీరును బట్టి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతీ బూత్ స్థాయి సమన్వయ కమిటీలు త్వరలోనే వేస్తామని, ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ఎన్నికల్లోకి వెళ్ళడం జరుగుతుందని పార్లమెంట్ ఇన్చార్జి మైనంపల్లి హన్మంతరావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,ఆవుల పావని జగన్ యాదవ్ ,రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ,కోలన్ వీరేందర్ రెడ్డి,G. శ్రీనివాస్ యాదవ్,ప్రసన్న జగదీష్ యాదవ్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యురాలు వాణి స్టీఫెన్ పాల్, NMC కాంగ్రెస్ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు ఇందిరా,బి బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి ,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మహిళా జెనరల్ సెక్రెటరీ రఫియా బేగం,సీనియర్ నాయకులు చల్లా సుధీర్ రెడ్డి,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,నాగరాజ్ యాదవ్, ఆశి మల్లేష్,తలారి సాయి ముదిరాజ్,సురేందర్ కుమార్ యాదవ్,మహేందర్,సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు,ఇతర ముఖ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 13 at 1.56.56 PM

SAKSHITHA NEWS