సీఎం జగన్, కేతిరెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్

Spread the love

జగన్ గారూ మీరు నన్ను చూడాలనుకుంటే లైవ్ లింకు పంపిస్తా: లోకేశ్

58వ రోజు కొనసాగిన లోకేశ్ పాదయాత్ర

ధర్మవరం నియోజకవర్గంలో యువగళం

బత్తలపల్లిలో బహిరంగ సభ

సీఎం జగన్, కేతిరెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 58వ రోజు (ఆదివారం) ధర్మవరం నియోజకర్గంలో ఉత్సాహంగా సాగింది.

ధర్మవరం నియోజకవర్గంలో వరుసగా రెండోరోజూ కూడా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.

దారివెంట అడుగడుగునా మహిళలు లోకేశ్ కు నీరాజనాలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు.

బత్తలపల్లి ప్రధాన రహదారి జన ప్రవాహంతో కిటకిటలాడింది. 

బత్తలపల్లిలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకగా, అదే సమయంలో లోకేశ్ పైన పోలీసు డ్రోన్ ఎగిరింది.

ఈ సమయంలో ఆగి సెల్ఫీ దిగిన లోకేశ్… అయ్యా జగన్ గారు మీరు నన్ను చూడాలి అనుకుంటే మీకు యూట్యూబ్ లైవ్ లింక్ పంపిస్తా అంటూ డ్రోన్ ఎగురుతున్న వీడియో విడుదల చేశారు.

,బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి…!

ఉప్పలపాడు రీచ్ నుంచి వెళ్తున్న ఇసుక టిప్పర్ల ఎదుట సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అని విమర్శించారు. 

“నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట, చెరువులను ఆక్రమించి చేసిన క‌బ్జాలు చూపించాను.

ఈ రోజు ఉద‌యం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా చూపిస్తున్నాను.

జ‌నాల్ని ఏమార్చేందుకు గుడ్ మార్నింగ్ డ్రామా, మూడు పూటలా చేసేవి క‌బ్జాలు-దందాలు. డ్రామాల‌న్నీ బ‌ట్టబ‌య‌ల‌య్యాయి.

బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

యువగళం దెబ్బకు మంత్రులను మార్చే పనిలో జగన్!

వైసీపీ అరాచక పాలనపై పోరు సాగిస్తూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర 58వ రోజుకు చేరుకునే సరికి జగన్ నలుగురు మంత్రులను మార్చే పనిలో పడ్డాడడని లోకేశ్ ఎద్దేవా చేశారు.

అదీ యువగళం పవర్… యువత బలం అని లోకేశ్ ఉద్ఘాటించారు. బత్తలపల్లి సభలో మాట్లాడుతూ 400 రోజుల పాదయాత్ర పూర్తయితే ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. 

“జగన్ నమ్ముకున్న రాజారెడ్డి రాజ్యాంగం ఓడింది… అంబేద్కర్ రాజ్యాంగం నన్ను ముందుకు నడుపుతోంది.

పార్టీ మారాలని ఎంతో మంది భయపెట్టినా పసుపు జెండాతోనే మా జీవితం అని ఈ ప్రాంత ప్రజలు నిలబడ్డారు.

ఎన్టీఆర్ ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో… ప్రజల గుండెల్లో పసుపు జెండా పాతుకుపోయింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కొట్టిన దెబ్బకు జగన్ రెడ్డి విలవిల్లాడుతున్నాడు” అని వ్యాఖ్యానించారు.

జగన్ ముద్దుపేరు చోర్ మోహన్!
జగన్ కు చోర్ మోహన్ అని ముద్దుగా పేరు పెట్టానని లోకేశ్ వెల్లడించారు. “ఈ చోర్ మోహన్  చేసేవి అన్ని దొంగ పనులే అందుకే ఆయనకి చోర్ మోహన్ అని పేరు పెట్టా.

శ్రీకాళహస్తిలో బడాచోర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని చంద్రబాబు బలిదానం చేశాడని విమర్శించాడు.

అయ్యా బడా చోర్ నరబలి ఇచ్చింది మీ అధ్యక్షుడు చోర్ మోహన్. సీఎం పదవి కోసం సొంత బాబాయ్ ని నరబలి ఇచ్చాడు. 

చోర్ మోహన్ ఇంకో ప్రచారం మొదలుపెట్టాడు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తుంది అని వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నాడు.

రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ. టీడీపీ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి అంటే నీ తరం కాదు” అని స్పష్టం చేశారు.

అప్పుల బాధతో మరణించిన చేనేత కార్మికుడి పిల్లలను నేనే చదివిస్తా

ధర్మవరం సీఎన్బీ కళ్యాణ మండపంలో చేనేత, పట్టు కార్మికులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.

సమావేశంలో రాములమ్మ అనే చేనేత మహిళ అప్పుల బాధతో భర్త చనిపోయాడని, ఇద్దరు పిల్లల్ని చదివించడం భారంగా మారిందని  ఆవేదన వ్యక్తం చేయగా, లోకేశ్ చలించిపోయారు.

ఆమె ఇద్దరి పిల్లల చదువు బాధ్యతను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నుండి ఆ పిల్లల చదవు బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. 

“ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు టీడీపీ అధికారంలోకి రాగానే రూ.10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందిస్తాం.

పట్టణ ప్రాంతాల్లో చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, మౌలిక వసతులతో కూడిన కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.

చేనేత సమస్యల పై నాకు అవగాహన ఉంది అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత ను దత్తత తీసుకుని సమస్యలు పరిష్కరిస్తా” అని హామీలు ఇచ్చారు.

లోకేశ్ కు ప్రత్యేక వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం బహూకరణ

ధ‌ర్మవ‌రంలో నేత‌న్నలైన తొగ‌టవీర క్షత్రియ సంఘం లోకేశ్ ను ప‌ట్టువ‌స్త్రాల‌తో ఆత్మీయంగా స‌త్కరించారు.

చేనేత‌లో నైపుణ్యాన్ని ప్రద‌ర్శించి, లోకేశ్ ప్రతిరూపాన్ని యువ‌గ‌ళం పేరుని ప‌ట్టుతో నేసి వ‌స్త్రరూపంలోకి తీసుకొచ్చారు.

తొగ‌ట వీర క్షత్రియుడైన పుట్లూరు ప్రకాశ్ అత‌ని స్నేహితులు ప‌ట్టులో ఆత్మీయ‌త క‌ల‌నేసి ఇచ్చిన అపురూప బ‌హుమ‌తి లోకేష్ అందుకున్నారు. 

చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్, మ‌న‌వ‌డు దేవాన్ష్‌, భార్య భువ‌నేశ్వరి, కోడ‌లు బ్రాహ్మణి కోసం చేతి మ‌గ్గాల‌పై స్వచ్ఛమైన ప‌ట్టుతో నేసిన వ‌స్త్రాల‌ను బ‌హూక‌రించారు.

ధ‌ర్మవ‌రం నేతన్నలు త‌మ‌పై చూపించిన అభిమానానికి లోకేశ్ ఆనందంతో పుల‌కించిపోయారు.

తొగ‌టవీర క్షత్రియుల కుల‌దేవ‌త నంద‌వ‌రం చౌడేశ్వరి అమ్మవారి చిత్రాన్ని ప‌ట్టుతో నేసి లోకేశ్ అంద‌జేశారు.

యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటి వరకు నడిచిన దూరం 745.8 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 13.7 కి.మీ.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page