SAKSHITHA NEWS

సాక్షిత : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు అందరూ కృషి చేయాలని పారిశుద్ధ్య విభాగపు అధికారులను కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఆదేశించారు.*
నగరపాలక సంస్థ లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యశాఖ అధికారులు, శానిటరీ సూపర్ వైజర్లు, మెస్త్రిలతో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే స్వచ్ సర్వెక్షన్ బృందం తిరుపతికి రానుందన్నారు. నగరంలో ఎక్కడా చెత్త లేకుండా సిబ్బంది అంతా కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు. ప్రతి ఇంటి వద్ద, దుకాణాల వద్ద ఉత్పత్తి అయిన తడి, పొడి చెత్త ను నగరపాలక సంస్థ వాహనాల వారికి అందించాలని, అలా కాకుండా రోడ్ల పక్కన వేసిన వారికి జరిమానాలు విధించాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. నగరంలో ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా తనిఖీలు చేపట్టి, జరిమానా లు విధించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని చికెన్, మటన్ దుకాణాల వద్ద పారిశుద్ధ్యం బాగా ఉండేలా చూడాలన్నారు. అలాగే మటన్, చికెన్ ప్లాస్టిక్ కవర్లలో ఇవ్వకుండా ఇంటివద్ద నుండి డబ్బాలు తెచ్చుకునేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే డ్రైనేజీలో చెత్త, మట్టి తొలగించే పనులు చేపట్టాలన్నారు. యూజర్ చార్జీలు కూడా ప్రతి నెలా సక్రమంగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. వీదికుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నామన్నారు. అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తూ కివాకం ఏర్పాటు చేశామన్నారు. వీధుల్లో పట్టుకున్న కుక్కలను అక్కడికి తీసుకెళ్ళి వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో స్తెరిలైజ్ చేసిఅంటి రాబీస్ వాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు కంప్లైంట్ సెల్ ను హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.
ఈ సమావేశంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరకృష్ణ, శానిటరీ సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS