SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 26 at 2.12.06 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు …

నిన్ను శాశ్వతంగా మాజీ చేయడమే ప్రజల ముందున్న లక్ష్యం

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం అచ్చంపేట:- అచ్చంపేట అభివృద్ధికి పటిష్టమైన పునాదులు వేసి చూపిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని, 100 కోట్లకు అమ్ముడు పోలేదు, 200 కోట్లతో అచ్చంపేట ప్రాంతాన్ని సశ్యామలం చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. నిన్ను శాశ్వతంగా మాజీ చేయడమే అచ్చంపేట ప్రజల ముందున్న లక్ష్యమని తెలిపారు.

ఉప్పునుంతల, వంగూరు మండలాలను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న ఉల్పర- మొల్గర మధ్య దుందుభి వాగు పై వంతెన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే టెండర్లు వేసి వంతెన నిర్మాణం పనులు వేగవంతంగా చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా కృషి చేస్తామన్నారు.

మైనార్టీలకు అవసరమైన ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం రూ.2కోట్లు మంజూరు అయ్యాయని, రాష్ట్రంలోనే వికలాంగుల కోసం అదనంగా 1000/- లు పెంచి వారికి తోడుగా నిలబడుతున్నట్లు తెలిపారు. సముద్ర మట్టం నుండి 600 మీటర్ల ఎత్తులో ఉన్న అమ్రాబాద్ మండలానికి నిరంజన్ షావలి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామన్నారు.

సీఎం కేసీఆర్ కి భక్తి భావం ఉండడంతో మన తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలను కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన నాయకుడు సీఎం కేసీఆర్ గారేనని వివరించారు. ప్రజల ఆశయాన్ని నెరవేర్చడం కోసం ప్రభుత్వంతో చర్చించి నిధులు తీసుకురావడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని అనుసరించి నడిచే నాయకుడిగా నేను అచ్చంపేట ప్రజలకు చేస్తున్నానని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ మాట ఇస్తే మనమతిప్పడు అని దేశ ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో దేశ రాజకీయాలకు వెళ్లడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి చేతకాని, అసమర్థులు అని ప్రజలు తీర్పు ఇచ్చి దేశంలో రాష్ట్రంలో ఘోరంగా ఓటమి పలు చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకులు నూటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని విమర్శించారు. వారికి తగిన బుద్ధిని ప్రజలే చెబుతారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మండలాల పార్టీల అధ్యక్షులు పర్వతాలు ముదిరాజ్, రవీందర్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి, కౌన్సిలర్ రమేష్ రావు, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, శంకర్ మాదిగ, సోమ్లా నాయక్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS