SAKSHITHA NEWS

చట్టసభలు భౌతిక దాడులకు వేదిక కారాదు – ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నివ్వెర పరిచింది…ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్*
ప్రజా సమస్యల పరిష్కార వేదిక అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి
చట్టసభల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాలి
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విగాథం కలిగించే పరిణామాలు అసెంబ్లీ లాంటి వేదికలలో చోటు చేసుకోరాదు
భావస్వేచ్ఛను హరించే విధంగా ఉండే జీవో నెంబర్ 1 రద్దు చేయాల్సిందే.


సాక్షిత యర్రగొండపాలెం : ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నివ్వెర పరిచిందని, చట్టసభలు భౌతిక దాడులకు వేదిక కారాదని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి వి.సుదర్శన్ పత్రికా ముఖంగా ఖండించారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు చట్టసభల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గదర్శకులు కావాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే ఏ పరిణామాలు అయినా అసెంబ్లీ లాంటి వేదికలలో చోటు చేసుకోరాదని సూచించారు.

గతంలో మాదిరి అసెంబ్లీ జరగడంలేదని, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్వహిస్తున్న అసెంబ్లీ లాంటి సమావేశాలలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ సభ్యులు చెప్పేది వినేదిగా, ప్రభుత్వం చేసింది, చేయబోయేది చెప్పేదిగా ఉండాలే కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోరాదని విమర్శించారు. ప్రజల గొంతు నొక్కేదిగా, భావస్వేచ్ఛను హరించేదిగా ఉండే ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవో నెంబర్ 1 రద్దు చేయాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు


SAKSHITHA NEWS