SAKSHITHA NEWS

కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది – శాసనమండలి చైర్మన్ గుత్తా

మిర్యాలగూడ (సాక్షిత ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
మిర్యాలగూడ ఎమ్మేల్యే భాస్కర్ రావు తో కలిసి
మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అప్రజాస్వామిక విధానాలను విడానాడాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే పనిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు
సిబిఐ,ఈడి ,ఐటీ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకొని, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టి ,ప్రతిపక్ష నాయకుల గొంతులు నొక్కుతుందని, గవర్నర్ వ్యవస్థను కూడా బీజేపీ నిర్వీర్యం చేస్తుంది.ఇది మంచి పద్ధతి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను లాక్కోవాలని చూస్తోందని ప్రత్యేక రాష్ట్రంగా విభజన చెంది తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న కేంద్రం కృష్ణా, గోదావరి జలాలలో వాటాలను తేల్చలేకపోయిందన్నారు.
రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం చర్య సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అలా చర్యలు చేసుకుంటూ పోతే ఏ నాయకుడు ఏ పార్టీలో మిగలారు. రాహుల్ గాంధీ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని
వామపక్షాలతో మునుగోడు బై ఎలక్షన్ లో కలిసి పని చేసిన మాట వాస్తవం ,కానీ భవిష్యత్తులో ఇరుపక్షాలు కలవాలని ఉంటే కలిసి పని చేస్తామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కరరావు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే భాస్కరరావు ఘన విజయం సాధిస్తారన్నారు.


SAKSHITHA NEWS