SAKSHITHA NEWS

తిరుపతి నగరంలో జాయ్ ఈ బైక్స్ తో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఆటోమొబైల్స్ ను తిరుపతి నగర మేయర్ దంపతులు డాక్టర్ శిరీష, డాక్టర్ మునిశేఖర్ ప్రారంభించారు. స్థానిక రేణిగుంట రోడ్డులో ఏర్పాటు చేసిన ఆ షోరూం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రికల్ బైకుల ఆవా కొనసాగుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ వెహికల్ తో పోలిస్తే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం ద్వారా 85% వ్యయన్ని తగ్గించుకోవచ్చు అన్నారు. భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదేనన్నారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన అవసరమని తెలిపారు. ఈ జాయ్ ఈ బైక్స్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక వైసీపీ నాయకుల అజయ్ కుమార్ మాట్లాడుతూ పెట్రోల్ రహిత వాహనాలు వినియోగం ఎక్కువ అవుతుందన్నారు. నేటి యువతను ఆకర్షించేలా వారాహి ఆటోమొబైల్స్ సర్ కొత్త ఆకర్షణమైన మోడల్స్, కలర్స్ బైక్లను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనరల్ హెడ్ జగన్, రీజనల్ మేనేజర్ శోభన్, షోరూం ఎండి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 20 at 5.49.45 PM

SAKSHITHA NEWS