SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇందులో భాగంగా.. పర్వత్ నగర్ లోని ముస్లిమ్స్ స్మశాన వాటికను మరియు రామారావు నగర్ లోని హిందూ స్మశాన వాటికను ప్రారంభించారు…అనంతరం సెంటర్ అల్లాపూర్ మసీదును పరిశీలించి మౌలిక సదుపాయాలుకు ఇబ్బంది ఉంటే తెలపాలని.. అలాగే ఇక్కడికి వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.. అనంతరం రామారావు నగర్, కబీర్ నగర్ నాలా పనులు పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. వందల కోట్ల రూపాయలతో అల్లాపూర్ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎక్కడికక్కడ రోడ్లు, మంచినీరు, విద్యుత్, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం వంటి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు పూర్తి చేశామని ..ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని.. నేడు అల్లాపూర్ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు నివసించడానికి మరియు చుట్టుపక్కల ప్రాంతాలైన హైటెక్ సిటీ.. కూకట్పల్లి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రధాన కేంద్రంగా మారిందని అన్నారు

.. ఇందుకు కావాల్సిన రోడ్లు, ఫ్లైఓవర్లు అండర్పాస్ బ్రిడ్జిలు కూడా పూర్తి చేశామని ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.. అలాగే అక్కడక్కడ ఉన్న నాలా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అల్లాపూర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా మారుస్తామని అన్నారు… నాలా పనులు జరిగే విషయంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని.. నాలా పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్.. మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్.. డివిజన్ అధ్యక్షులు ఐలయ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS